¡Sorpréndeme!

ప్రియుడితో ఫాం హౌస్‌లో.. టాప్ హీరో భార్య ! | Filmibeat Telugu

2017-12-18 4,313 Dailymotion

After filing the divorce, there was a buzz of Farhan Akhtar having an affair with star kid Shraddha Kapoor and Adhuna is dating Dino Morea’s younger brother, Nicolo Morea.

2017 సంవత్సరంలో చాలా మంది సెలబ్రిటీల కాపురాలు కూలిపోయాయి. మనస్పర్ధలు, ఇతరత్రా కారణాలతో విడాకులు తీసుకున్నారు. అందులో బాలీవుడ్ నటుడు, 'భాగ్ మిల్ఖా భాగ్' ఫేం పర్హాన్ అక్తర్ కూడా ఒకరు. బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానితో 16 ఏళ్ల క్రితం ప్రేమలో పడి వివాహం చేసుకున్న అక్తర్... ఈ ఏడాదిప్రారంభంలో విడిపోయారు. వీరి విడాకులు అయిన తర్వాత పర్హాన్ అక్తర్... బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి వేళ్లలో అతడి ఇంటి నుండి బయటకు వస్తూ శ్రద్ధా కనిపించడం మీడియాలో హాట్ టాపిక్ అయింది.
విడాకుల తర్వాత అధునా బబానీ కూడా మరో తోడును వెతుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటుడు డినో మోరియా తమ్ముడు నికోలో మోరియాతో ఆమె ఎఫైర్ పెట్టుకున్నట్లు బాలీవుడ్లో చాలా కాలంగా చర్చ సాగుతోంది.
కొంతకాలంగా వీరిద్దరూ కలిసే తిరుగుతున్నారు. తమ మధ్య ఎఫైర్ ఉందని మీడియాలో వార్తలు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమకు నచ్చిన విధంగా లైఫ్ లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అధునా భబానీ, నికోలో మోరియా ఇద్దరూ కలిసి ప్రస్తుతం గోవాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అధునాకు ఫాం హౌస్ విల్లా ఒకటి ఉంది. కొన్ని రోజులుగా ఇద్దరూ ఇక్కడే గడుపుతున్నట్లు సమాచారం.
అయితే ఈ క్రిస్మస్ సీజన్ ప్రియుడితో ఇక్కడే గడిపాలని నిర్ణయించుకున్న అధునా టూరిస్ట్ బుకింగ్ ఆపేసి... తన ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతోందట. ఇక్కడే నికోలో మోరియో బర్త్ డే కూడా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తుందట.